ఆర్టీఏ నిబంధనలు పట్టించుకోని స్కూల్ బస్సు డ్రైవర్లు!
- January 27, 2024
యూఏఈ: దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) గత సంవత్సరం అవసరమైన అనుమతులు లేకుండా పనిచేస్తున్న కొంతమంది పాఠశాల బస్సు డ్రైవర్లు మరియు రవాణా అటెండెంట్‌లను గుర్తించింది. 2023లో జూలై, డిసెంబర్ మధ్య పాఠశాలల బస్సులను మొత్తం 6,323 తనిఖీలు నిర్వహించినట్లు RTA తెలిపింది. అదేవిధంగా బస్సులో అగ్నిమాపక యంత్రం, GPS ట్రాకింగ్ సిస్టమ్ మరియు కెమెరాలు లేకపోవడంతో సహా ఇతర బస్సు భద్రతా నియమాలను కూడా ఉల్లంఘించినట్లు RTA గుర్తించింది. చెల్లుబాటు అయ్యే యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండటమే కాకుండా, పాఠశాల బస్సు డ్రైవర్ RTA నుండి ప్రత్యేకంగా అనుమతిని కూడా పొందాలి. ఇందుకోసం డ్రైవర్ తప్పనిసరిగా అవసరమైన శిక్షణలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే స్కూల్ బస్సుల్లో ఐదవ తరగతి వరకు బాయ్స్, ఉన్నత పాఠశాల వరకు గర్ల్స్ ఉంటే మహిళా సూపర్‌వైజర్ తప్పనిసరి. బస్సు యొక్క గరిష్ట వేగం గంటకు 80కిమీ మించకూడదు. ఇందుకోసం ఎమిరేట్స్ అథారిటీ ఫర్ స్టాండర్డైజేషన్ మరియు మెట్రాలజీ ఆమోదించిన స్పీడ్ కంట్రోల్ పరికరాన్ని బస్సుల్లో అమర్చుకోవాలి. ఇదిలా ఉండగా.. ప్రతి సెమిస్టర్ ప్రారంభంలో అన్ని విద్యా సౌకర్యాల వద్ద ఇంటెన్సివ్ ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్‌లు నిర్వహిస్తామని ఆర్టీఏ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







