ముగిసిన అల్ మౌజ్ మస్కట్ మారథాన్-2024
- January 28, 2024
మస్కట్: అల్ మౌజ్ మస్కట్ మారథాన్ -2024 పోటీలు జనవరి 27న ముగిశాయి. ఇందులో ఒమన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో నివసిస్తున్న ఒమానీ , విదేశీ అథ్లెట్లు పాల్గొన్నారు. 5 కి.మీ మారథాన్ పోటీల్లో అబ్దుల్లా అల్ ఖురైనీ ప్రథమ స్థానం, సేలం అల్ రషీది ద్వితీయ స్థానం సాధించగా.. తృతీయ స్థానంలో నాసర్ అల్ నబీ నిలిచారు. 3 కి.మీల పోటీలో విస్సామ్ అల్ మహరమి ప్రథమ స్థానం పొందారు. షాహీన్ గౌరీ ద్వితీయ స్థానం, జైద్ అల్ ధామ్రీ తృతీయ స్థానంలో నిలిచారు. 2 కిలోమీటర్ల పోటీలో తుర్కీ అల్-సుదైరి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో అవ్స్ అల్ ఫహదీ, తృతీయ స్థానంలో మాలిక్ అహ్మద్ నిలిచారు. చిన్నారుల కోసం జరిగిన 1 కిలోమీటరు పోటీలో తారిఖ్ బీరకదర్ ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం మిషారీ అల్ బలూషి, తృతీయ స్థానంలో ఒసామా అల్ బహ్రీ నిలిచారు. SABCO స్పోర్ట్స్ కంపెనీ (అల్ మౌజ్ మస్కట్ మారథాన్ ఆర్గనైజింగ్ కంపెనీ) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఖలీద్ బిన్ హమద్ అల్ బుసైది మాట్లాడుతూ.. ఒమన్ సుల్తానేట్ లో అల్ మౌజ్ మస్కట్ మారథాన్ అతిపెద్ద ఈవెంట్ అని అన్నారు. ఇది ప్రపంచ అథ్లెటిక్స్ ఫెడరేషన్లచే కూడా గుర్తింపు పొందిందని వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







