2027లో వరల్డ్ వాటర్ ఫోరమ్‌కు సౌదీ ఆతిథ్యం!

- January 28, 2024 , by Maagulf
2027లో వరల్డ్ వాటర్ ఫోరమ్‌కు సౌదీ ఆతిథ్యం!

రియాద్: 2027లో రియాద్‌లో జరగనున్న వరల్డ్ వాటర్ ఫోరమ్ 11వ సెషన్‌ను నిర్వహించేందుకు సౌదీ అరేబియా అధికారికంగా బిడ్ దాఖలు చేసింది. నీటి వనరుల సుస్థిరత, జీవన నాణ్యత మెరుగుదల, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన,  ప్రాంతీయ మరియు ప్రపంచ దశల్లో నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సౌదీ అరేబియా అంకితభావాన్ని ఫోరమ్ నిర్వహణతో చాటిచెబుతామని అధికార యంత్రాంగం తెలిపింది.  ప్రపంచవ్యాప్తంగా నీటి వనరుల స్థిరమైన నిర్వహణకు, ప్రపంచ అత్యుత్తమ పద్ధతులను ప్రదర్శించడానికి.. సహకారం కోసం మార్గాలను అన్వేషించడానికి ఫోరమ్ లో పాల్గొనే నిపుణులు చర్చించనున్నారు.  ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఉన్న దేశాల్లో ఒకటిగా సౌదీ ఉన్నా.. ఫోరమ్‌ను నిర్వహించే సామర్థ్యం తమకుందన్నారు.  కింగ్‌డమ్ యొక్క జాతీయ నీటి వ్యూహం భవిష్యత్తు కోసం బ్లూప్రింట్‌గా పనిచేస్తుందని, సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో దేశ నాయకత్వం ఉందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com