బ్యాకప్ అవసరం లేకుండానే వాట్సప్ చాట్ ట్రాన్స్ఫర్
- January 28, 2024
నిత్యం వినియోగించే వాట్సప్‌లో ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలతో పాటు ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటాం.
రోజుల తరబడి వాడినప్పుడు ఇందులోని సమాచారం పెద్ద మొత్తంలో పోగుబడి ఉంటుంది. ఒకవేళ కొత్త మొబైల్ కొన్నప్పుడు ఈ డేటా అవసరం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో పాత మొబైల్లోని డేటా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు బ్యాకప్ ఆప్షన్‌ను వినియోగిస్తుంటాం. మళ్లీ కొత్త ఫోన్లో రీస్టోర్ చేస్తుంటాం. ఇలా బ్యాకప్ చేయకుండా కూడా వాట్సప్‌లోని చాట్ హిస్టరీని కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇందుకోసం వాట్సప్ చాట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. క్లౌడ్ ఆధారంగా పనిచేసే బ్యాకప్ కంటే ఈ ప్రక్రియ చాలా వేగంగానూ, సులభంగానూ ఉంటుంది. ఇందుకోసం రెండు (పాత, కొత్త) ఫోన్లూ మీ వద్దే ఉండాలి. అవి రెండు ఒకే వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండడంతో పాటు, లొకేషన్ సర్వీసు కూడా ఆన్‌లో ఉంచాలి.
ట్రాన్స్ఫర్ ఇలా..
ముందు మీ పాత ఫోన్లో వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
చాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో చాట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
చాట్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రక్రియ మీ పాత ఫోన్లో ప్రారంభం అవుతుంది. ఇక్కడో క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది.
తర్వాత కొత్త ఫోన్లో వాట్సప్ ఇన్స్టాల్ చేయాలి. అదే ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్ కోడ్‌ను కొత్త దాంట్లో ఎంటర్ చేయాలి.
కొత్త ఫోన్లో చూపించే క్యూఆర్ కోడ్‌ను పాత ఫోన్లో చూపించే స్కానర్‌తో స్కాన్ చేయాలి.
ఆ తర్వాత పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్లోకి బదిలీ అవుతుంది.
కొన్ని నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రక్రియ సమయంలో రెండు ఫోన్లూ పక్కపక్కనే ఉంచాలి. స్క్రీన్లూ ఆన్‌లోనే ఉంచాలి.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







