టీటీడీ వార్షిక బడ్జెట్ 2024-25కు పాలకమండలి ఆమోదం
- January 29, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ కు పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో 2024-25 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపొందించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా 338 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది.
సాధారణంగా టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఆమోదిస్తుంటారు. అయితే ఈసారి జనవరిలోనే వార్షిక బడ్జెట్‌ను టీటీడీ పాలకమండలి ఆమోదించింది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావొచ్చన్న అంచనాలతో ముందుగానే వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు.
టీటీడీ వార్షిక బడ్జెట్ ఆదాయం అంచనాలు
హుండీ ఆదాయం రూ.1611 కోట్లుగా అంచనా
వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా రూ.1167 కోట్ల వడ్డీ రాబడి
ఇతర పెట్టుబడిల ద్వారా రూ.129 కోట్లు ఆదాయం
ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.338 కోట్లు ఆదాయం
టీటీడీ వార్షిక బడ్జెట్ కేటాయింపులు
ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1733 కోట్లు
నిత్యవసరాలు కొనుగోళ్లకు రూ.751 కోట్ల కార్పస్ ఫండ్
ఇతర పెట్టుబడులకు రూ.750 కోట్లు
ఇంజనీరింగ్ పనులకు రూ.350 కోట్లు
శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ కు రూ. 53 కోట్లు
స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి పనులకు రూ.60 కోట్లు
ఇంజనీరింగ్ మెయిన్టనెన్స్ పనులకు రూ.190 కోట్లు
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









