ఫిబ్రవరి 5 నుండి 11 వరకు దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్
- January 29, 2024
దోహా: ఖతార్ యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని తెలియజేసేలా ఫిబ్రవరి 5 నుండి 11 వరకు దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ (DJWE) 20వ ఎడిషన్ ను నిర్వహించనున్నారు. ఇందులో 10 మంది ఖతారీ డిజైనర్ల ప్రతిభను ప్రదర్శించనున్నారు. వారి కళాఖండాలలో బట్టోలా, సాంప్రదాయ ఫ్యాషన్ మాస్క్, రాబోయే రమదాన్ కోసం రూపొందించిన పూసల ఆభరణాలు, అద్భుతమైన ఖతార్ మ్యాప్ ఆకారపు నెక్లెస్ లు ఉన్నాయి. ఖతారీ డిజైన్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పెవిలియన్లో హెస్సా జ్యువెల్స్, అల్ ఘ్లా జ్యువెలరీ, డి ట్రోవ్, ఘండ్ జ్యువెలరీ, హెచ్ జ్యువెలరీ, కల్తామ్ యొక్క ఫైన్ జ్యువెలరీ, మిడాద్ జ్యువెలరీ, నౌఫ్ జ్యువెలరీ, థమీన్ జ్యువెలరీ మరియు ట్రిఫోగ్లియో వంటి సంస్థలు ఉన్నాయని ఖతార్ టూరిజం చీఫ్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఆఫీసర్ ఇంజినీర్ అబ్దుల్ అజీజ్ అలీ అల్ మావ్లావి తెలిపారు. ఇందులో 10 దేశాల నుండి 500 బ్రాండ్లను కలిగి ఉన్న ఈ ప్రదర్శన DECCలో జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









