భారతదేశానికి ఫ్రీక్వెన్సీని తగ్గించిన ఒమన్ ఎయిర్!
- January 30, 2024
యూఏఈ: ఆర్థిక పనితీరును మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ఒమన్ జాతీయ క్యారియర్ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంకలకు విమాన ఫ్రీక్వెన్సీలను సవరించింది. ఇస్లామాబాద్, లాహోర్, కొలంబో మరియు చిట్టగాంగ్‌లకు తమ కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. అయితే పాకిస్తాన్ నగరమైన సియాల్‌కోట్‌ను తన నెట్‌వర్క్‌లో చేర్చుకున్నట్లు తెలిపింది. భారతీయ మార్గంలో లక్నో, తిరువనంతపురం అనే రెండు ప్రస్తుత గమ్యస్థానాలకు సామర్థ్యాన్ని పెంచుతూ, నిర్దిష్ట మార్కెట్‌లకు ఫ్రీక్వెన్సీలను కూడా తగ్గించినట్లు వెల్లడించింది. నవంబర్ 2023లో ఒమన్ యొక్క సలామ్ ఎయిర్ హైదరాబాద్, కాలికట్, జైపూర్, త్రివేండ్రం మరియు లక్నో ఐదు కీలక భారతీయ నగరాలకు విమానాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశానికి విమాన హక్కుల కేటాయింపుల పరిమితి కారణంగా విమానాలు నిలిపివేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







