ఢిల్లీలోని పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ నిర్మాణనికి యోచన
- January 30, 2024
హైదరాబాద్: ఢిల్లీలోని పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ ను నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. పటౌడీ హౌస్ లో ఉన్న ఐదున్నర ఎకరాల ప్రాంతంలో ఈ భవనాన్ని నిర్మించాలని యోచిస్తోంది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ భవనాన్ని నిర్మించాలని భావిస్తోంది. ఈ భవనంపై వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనం యొక్క విస్తీర్ణం, ఎన్ని గదులు ఉన్నాయి తదితర వివరాల గురించి ఆరా తీశారు.
మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ పై మార్చిలోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలను చేపట్టిన మల్లు రవి తెలంగాణ భవన్ నిర్మాణంపై పూర్తి దృష్టిని సారించారు. రాష్ట్రం ప్రభుత్వం తరపున కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపిస్తామని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తామని మల్లు రవి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







