రెండు లక్షలపైన వస్తు కొనుగోళ్లపై ఒకశాతం పన్ను.
- May 31, 2016
రెండు లక్షలపైన వస్తు, సేవల నగదు కొనుగోళ్లపై ఇకపై ఒకశాతం పన్ను భారం పడనుంది. ఆభరణాలకు సంబంధించి మాత్రం ఒకశాతం పన్ను రూ.5 లక్షలపైన కొనుగోళ్లపై ఉంటుంది. అయితే బులియన్‌కు సంబంధించి మాత్రం ఒకశాతం పన్నుకు రూ.2 లక్షల పరిమితి వర్తిస్తుంది. సోర్స్ (టీసీఎస్) వద్ద అమలయ్యే ఈ ఒకశాతం పన్ను నిర్ణయం జూన్ 1 నుంచీ అమల్లోకి వస్తుంది. పసిడి, ఆభరణాలకు సంబంధించి సోర్స్ వద్ద ఒకశాతం పన్ను 2012 జూలై 1 నుంచీ అమలవుతోందని, ఇదే పరిస్థితి ఇకముందూ అమలవుతుందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.
2016-17 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం వస్తు, సేవల నగదు కొనుగోళ్లపై తాజా ఒకశాతం పన్ను అమల్లోకి వస్తుందని తెలిపింది.
అలాగే స్టాక్ మార్కెట్లో ఆప్షన్ అమ్మకాలపై కూడా జూన్ 1 నుంచీ పెంచిన సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) 0.05 శాతం (0.017 శాతం నుంచి) అమలవుతుందని ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటన తెలిపింది. రూ. 10 లక్షలు పైబడిన లగ్జరీ కార్ల కొనుగోళ్లపై కూడా సోర్స్ వద్ద ఒకశాతం పన్ను విధించాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







