మతాఫ్లో పిల్లల స్ట్రోలర్లకు అనుమతి లేదు
- January 31, 2024
మక్కా: గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు వ్యవహారాల సంరక్షణ కోసం జనరల్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల స్ట్రోలర్లు మతాఫ్ (పవిత్ర కాబా చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రాంతం) గ్రౌండ్ ఫ్లోర్‌లోకి తీసుకురావడానికి అనుమతించరు. మక్కాలోని గ్రాండ్ మసీదు లోపల పిల్లల స్ట్రోలర్లను తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయని అథారిటీ ప్రకటించింది. గ్రాండ్ మసీదు లోపలికి పిల్లల స్ట్రోలర్లను తీసుకురావడానికి మతాఫ్లోని పై అంతస్తులు, అలాగే మసా (సఫా మరియు మార్వా మధ్య నడిచే ప్రాంతం) ఉన్నాయని తెలిపింది. ఇక్కడ కింగ్ ఫహద్ విస్తరణ ప్రాంతం గుండా స్ట్రోలర్ల ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. మతాఫ్ మరియు మసా అంతస్తుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటే పిల్లల స్ట్రోలర్లు కూడా పవిత్ర మసీదులోకి ప్రవేశించడం నిషేధించబడుతుందని అధికార యంత్రాంగం పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







