యూఏఈ బీమా కంపెనీకి 1.2 మిలియన్ దిర్హామ్‌ల జరిమానా
- January 31, 2024
యూఏఈ: ఎమిరేట్స్‌లో పనిచేస్తున్న ఒక బీమా కంపెనీపై Dh1.2 మిలియన్ల ఆర్థిక ఆంక్షలు విధించింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యూఏఈ (CBUAE). మనీలాండరింగ్ నిరోధకం, తీవ్రవాదానికి ఫైనాన్సింగ్, చట్టవిరుద్ధ సంస్థల ఫైనాన్సింగ్ (AML/CFT)పై 2018 ఫెడరల్ డిక్రీ లా నంబర్ (20)లోని ఆర్టికల్ 14 ప్రకారం ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. బీమా కంపెనీ AML/CFT పాలసీలు మరియు విధానాల్లో లోపాలను కలిగి ఉన్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బీమా రంగం పారదర్శకత, సమగ్రతను కాపాడేందుకు ఆమోదించిన చట్టాలు, నిబంధనలను అన్ని బీమా కంపెనీలు, వాటి యజమానులు కట్టుబడి ఉండాలని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







