చిరంజీవి అందుకే అందరికీ అంత స్పూర్థి.!
- February 01, 2024
మెగాస్టార్ అనే బిరుదు ఏమంత సులువుగా దక్కేయలేదు చిరంజీవికి. దాని వెనక ఆయన కఠోర శ్రమ, పట్టుదల, డెడికేషన్.. ఎంతో వుంది. అదే ఆయన్ని ఆరు పదుల వయసులోనూ అంతే ఉత్సాహంగా ముందుకు నడిపిస్తోంది.
ఇటీవలే పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఇంకేం కావాలి చిరంజీవికి. హాయిగా కాలు కదపకుండా కూర్చుంటే సరిపోదా.? అనుకుంటే పొరపాటే.
ఆయన ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదో ఫాంటసీ మూవీ అంటున్నారు. సరే.. ఫాంటసీ అంటే ఏవేవో గ్రాఫిక్స్ చేసేసి.. చిరంజీవిని అలా అందంగా చూపించేస్తే సరిపోతుందిగా.. అనుకోవచ్చు.
కానీ, ఆయన చిరంజీవి. ఆరు పదుల వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. ఆయన కష్టం ముందు వయసు ఎప్పుడూ ఓడిపోతూనే వుంది. ఈ వయసులోనూ కఠినమైన వర్కవుట్లు చేస్తూ.. ‘గెట్ రెడీ ఫర్ ‘విశ్వంభర..’ అంటున్నారాయన.
చూస్తుంటే.. సిక్స్‌టీస్‌లో సిక్స్ ప్యాక్ చేసేసేలా వుంది ఆయనలోని నటనోత్సాహం. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ట్రెండింగ్ కాదు.. ట్రెండ్ సెట్టర్ ఆయన.. ఆయనకు ట్రెండింగ్స్ కొత్తా.! ఈ వీడియో ఎందరికో ఇన్సిప్రేషన్ అవుతోందిప్పుడు.
Gearing up .. And raring to go #Vishwambhara pic.twitter.com/VeUj0yhN35
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2024
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







