వరుణ్ తేజ్ సినిమా వాయిదా.! కారణమిందే.!

- February 01, 2024 , by Maagulf
వరుణ్ తేజ్ సినిమా వాయిదా.! కారణమిందే.!

మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ ఓ ఇంటివాడయ్యాకా వరుసగా రెండు ప్రాజెక్టులు సెట్స్ మీదికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘ఆపరేషన్ వాలైంటైన్’. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.

తెలుగులో మొట్ట మొదటి ఎయిర్ ఫోర్స్ విజువల్ వండర్  సినిమాగా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు. కొత్త దర్శకుడు సరికొత్తగా ఈ సినిమాని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

కాగా, ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, వాయిదా పడినట్లుగా తాజా సమాచారం అందుతోంది. అందుకు కారణం ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ వుండిపోయిందట.

ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందబోయే సినిమా కాబట్టి.. భారీ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఇంకా వర్క్ పెండింగ్ వుండడంతో.. సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ఇంకా రిపోర్ట్ రాలేదు చూడాలి మరి. బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కి జోడీగా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com