యూఏఈలో 'ఐక్విట్‌' టూర్‌

- June 01, 2016 , by Maagulf
యూఏఈలో 'ఐక్విట్‌' టూర్‌



మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ప్రివెన్షన్‌, మొబైల్‌ స్మోకింగ్‌ విరమణ క్లినిక్‌ని వరల్డ్‌ నో టుబాకో డే సందర్భంగా ప్రారంభించింది. మినిస్ట్రీ హెడ్‌ క్వార్టర్స్‌ అల్‌ ముహైస్నాహ్‌లో ఈ క్లినిక్‌ని ఏర్పాటు చేశారు. ఇది నాలుగు మాల్స్‌ మరియు పలు హాస్పిటల్స్‌లో జరుగుతుంది. నెల రోజులపాటు ఈ టూర్‌ ఉంటుంది. స్మోకింగ్‌కి అలవాటుపడ్డవారికి, ఆ దురలవాటుని మాన్పించేందుకోసం ఈ మొబైల్‌ క్లినిక్‌ ఉద్దేశింపబడింది. ఐక్విట్‌ క్లినిక్‌ ద్వారా ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. స్మోకింగ్‌ మానేస్తామని క్లినిక్‌ ద్వారా స్మోకర్స్‌తో ప్రతిజ్ఞ చేయిస్తారు. స్మోకర్స్‌ తొలుత తమ వివరాల్ని నమోదు చేయాలని, ఆ తర్వాత తమ ఫింగర్‌ ప్రింట్‌ని బోర్డ్‌పై వేయాల్సి ఉంటుందనీ, ఇదంతా ప్రతిజ్ఞలో భాగమని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి చర్యలు అభినందనీయమే అయినప్పటికీ, వీటితోనే స్మోకింగ్‌ని మానేయడం కష్టమని 23 ఏళ్ళ వయసున్న స్మోకర్‌ సయీద్‌ చెప్పారు. స్మోకింగ్‌ ప్రమాదకరమని తెలిసినా, దాన్ని తాను ఆస్వాదిస్తున్నానని చెప్పారు. అయితే స్మోకింగ్‌ చాలా ప్రమాదకరమనీ, ప్రధానంగా క్యాన్సర్‌ బారిన పడేందుకు స్మోకర్స్‌కి అవకాశం ఎక్కువని వైద్యులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com