రమదాన్ సందర్భంగా ధరలపై నిఘా
- June 01, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అధికార ప్రతినిథి, రమదాన్ సందర్భంగా అలాగే మిగతా రోజుల్లో ధరలపై నిఘా కొనసాగుతుందని చెప్పారు. నిర్ధారిత మార్కెట్ రేట్లను మించి ఎక్కువ ధరకు ఫుడ్ స్టఫ్ సహా ఇతర వస్తువుల ధరలు ఉంటే ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ వర్గాలు హెచ్చరించాయి. ఆయిల్, బ్రెడ్, ఫ్లోర్, షుగర్, చికెన్, మీట్, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ వంటివాటిపై నిఘా కొనసాగుతుంది గనుక, రిటైలర్స్ అమ్మకాలపై జాగ్రత్తగా ఉండాలని కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ డైరెక్టర్ డాక్టర్ హషీమ్ అల్ నౌమి చెప్పారు. వినియోగదారులకు ధరల విషయంలో ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించాలని చెప్పారు. 8001222 నంబర్‌కి ఫోన్ చేసి, ధరలపై ఫిర్యాదులు చేయవచ్చని ఆయన సూచించారు. మినిస్ట్రీకి సంబంధించిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ కాల్ సెంటర్‌ని 600522225లోనూ సంప్రదించవచ్చని ఆయన చెప్పారు. స్మార్ట్ ఫోన్లు మరియు ట్యాబ్లెట్లు, అలాగే రీ కాల్ సర్వీస్‌ల ద్వారా వినియోగదారుల హక్కుల్ని పరిరక్షించేందుకు మంత్రి వర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







