జోర్డాన్‌లో 30కి పైగా ప్రముఖుల ఫోన్‌లలో పెగాసెస్‌

- February 02, 2024 , by Maagulf
జోర్డాన్‌లో 30కి పైగా ప్రముఖుల ఫోన్‌లలో పెగాసెస్‌

అమ్మాన్‌: జోర్డాన్‌లో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు సహా 30 మంది ఫోన్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. వీరి ఫోన్‌లను ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసెస్‌తో హ్యాక్‌ చేసినట్లు డిజిటల్‌ హక్కుల సంస్థ యాక్సెస్‌ నౌ గురువారం ప్రకటించింది. 2020 నుండి గతేడాది నవంబర్‌ వరకు హ్యాకింగ్‌ జరిగినట్లు తెలిపింది. అయితే జోర్డాన్‌ ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడినట్లు పేర్కొనలేదు. కానీ ఈ పెగాసెస్‌ను నిర్వహించే ఇద్దరు ఆపరేటర్లకు జోర్డాన్‌ ప్రభుత్వంతో సంబంధం ఉందని   యూనివర్శిటీ ఆఫ్‌ టొరంటో ఆఫ్‌ సిటిజెన్‌ ల్యాబ్‌లోని డిజిటల్‌ పరిశోధకులు  2022 హ్యాకింగ్‌ బాధితుల నివేదికలో వెల్లడించారు. అయితే ఈ నివేదికపై జోర్డాన్‌ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

ప్రభుత్వానికి తప్ప తమ ఫోన్‌లను టార్గెట్‌ చేయాలన్న లక్ష్యం ఎవరికి ఉంటుందని ఆ ప్రాంతానికి చెందిన హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆడమ్‌ కూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన ఫోన్‌ కూడా హ్యాకింగ్‌కు గురైంది. మహిళలు, కార్మికుల హక్కులు, ఖైదీల కోసం పోరాడే న్యాయవాది హలా అహద్‌ ఫోన్‌ కూడా రెండుసార్లు హ్యాక్‌ చేసేందుకు యత్నించారని, అయితే మార్చి 2021 విజయవంతం కాగా, గతేడాది ఫిబ్రవరిలో విజయవంతం కాలేదని యాక్సెస్‌ నౌ పేర్కొంది.  ప్రముఖ పాలస్తీనియన్‌-అమెరికన్‌ జర్నలిస్ట్‌, కాలమిస్ట్‌ దావూద్‌ కూతాబ్‌ ఫోన్‌ కూడా 2022 ఫిబ్రవరి -2023 సెప్టెంబర్‌ మధ్య మూడు సార్లు హ్యాకింగ్‌కు గురైందని తెలిపింది. దావూద్‌ కాక మరో 15 మంది జర్నలిస్టులు, మీడియా వర్కర్ల ఫోన్‌లు హ్యాక్‌ అయ్యాయని వెల్లడించింది.    గతేడాదికి ముందు, జోర్డాన్‌ ప్రభుత్వానికి, ఇజ్రాయిల్‌ ఎన్‌ఎస్‌ఒ గ్రూపుకు మధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇది ఐస్‌బర్గ్‌లో ఓ చిన్న ముక్క మాత్రమేనని, జోర్డాన్‌లో పెగాసెస్‌ బాధితుల సంఖ్య అధికంగానే ఉండవచ్చని యాక్సెస్‌ నౌ తెలిపింది. సుమారు 30 లేదా 35 మంది వ్యక్తుల ఫోన్‌లపై నిఘా పెట్టి ఉండవచ్చని యాక్సిస్‌ నౌ సంస్థకు చెందిన  వెస్ట్‌ ఏసియా అండ్‌ నార్త్‌ ఆఫ్రికా డైరెక్టర్‌ మార్వా తెలిపారు.

ఐదుగురు ఫోన్‌లలో పెగాసెస్‌ను సిటిజన్‌ ల్యాబ్‌ గుర్తించగా, మిగిలిన వాటిని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్స్‌ సెక్యూరిటీ ల్యాబ్‌, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ మిగిలిన ఫోన్‌లలో పెగాసెస్‌ను గుర్తించింది.

కేవలం ఉగ్రవాదులు, క్రిమినల్స్‌పై నిఘా కోసం కేవలం ఇంటిలిజెన్స్‌, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీలకు మాత్రమే విక్రయిస్తామని ఎన్‌ఎస్‌ఒ పేర్కొంది. అయితే పెగాసెస్‌ను సుమారు రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం దుర్వినియోగం చేసినట్లు మెక్సికో నుండి థాయ్‌లాండ్,  పోలాండ్‌, సౌదీ అరేబియా వరకు 45కు పైగా దేశాల్లో కేసులు నమోదయ్యాయని సైబర్‌ సెక్యూరిటీ తెలిపింది. నిఘాపై ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌ను సంప్రదించామని, అయితే స్పందించలేదని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com