నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన TOMCOM
- February 04, 2024
హైదరాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (Tomcom) ఫిబ్రవరి 5, 2024న జపాన్‌లో ఉద్యోగాల కోసం హైదరాబాద్‌లో రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.
14-16 లక్షల మధ్య జీతం అందనుంది. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో రిక్రూట్మెంట్ ఈవెంట్ నిర్వహించనున్నరాు. .
జపాన్‌లో ఉద్యోగాల కోసం డ్రైవ్ నిర్వహిస్తున్నామని టామ్ కామ్ కౌన్సెలర్ చెప్పారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్లు లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని చెప్పారు. అభ్యర్థుల వయస్సు 22 నుంచి 27 సంవత్సరాల ఉండాలన్నారు. జపాన్‌లో ఉద్యోగాల కోసం హైదరాబాద్‌లో జరిగే రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన అదనపు సమాచారం 7893566493ని సంప్రదించాలని లేదా TOMCOM అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు పేర్కొన్నారు.
టామ్ కామ్ తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల క్రింద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉంది. తెలంగాణ నుంచి అర్హత కలిగిన నైపుణ్యం కలిగిన, సెమీ-స్కిల్డ్ కార్మికులకు విదేశీ నియామకాలను సులభతరం చేయడం కోసం టామ్ కామ్ పని చేస్తోంది. తెలంగాణ అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్, రొమేనియా, యూకే, గల్ఫ్ దేశాలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రిజిస్టర్డ్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







