రాజా సాబ్.! మారుతి ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవుగా.!
- February 05, 2024
ప్రబాస్ అంటే యూనివర్సల్ స్టార్. మరి, అంతటి రేంజ్ వున్న స్టార్ హీరోతో సినిమా అంటే కేవలం ఆ స్థాయి వున్న డైరెక్టర్లకే ఛాన్సుంటుంది. కానీ, చిన్న హీరోలతో చిన్న సినిమాలు తీసే మారుతికి ప్రబాస్‌ని డైరెక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చిందా.? అన్నది ఇప్పటికీ మిలిమిన్ డాలర్ల ప్రశ్నే.
ఛాన్స్ అయితే వచ్చేససింది. అదే ‘రాజా సాబ్’. మారుతి సినిమాలంటే ఓ ఐడియా వుందింతవరకూ. అయితే హీరోకి ఏదో ఒక డిఫెక్ట్ పెట్టడం.. లేదంటే.. హారర్ కామెడీతో ప్రేక్షకుల నాడి పట్టడం..!
మరి, ఏ జోనర్‌లో ప్రబాస్‌ని చూపించబోతున్నాడు.? ఖచ్చితంగా ప్రబాస్‌ని ఓ కొత్త జోనర్‌లో చూపించబోతున్నా.. అని మారుతి పదే పదే చెబుతున్నాడు. కంప్లీట్ హారర్ బేస్ కాన్సెప్ట్‌తో కాదు కాదు కాస్త హ్యూమరస్ కూడా యాడ్ చేస్తాడట.. ఈ జోనర్‌లోనే ప్రబాస్‌ని చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఎలా చూపించినా ప్రబాస్‌ని ఓ యాక్షన్ హీరోగానే జనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అలాగని ప్రబాస్ కామెడీ చేయలేడా.? అంటే.. ఆ రసం కూడా ప్రబాస్‌లో కూసింత ఎక్కువే.. ‘డార్లింగ్’ తదితర సినిమాలు ప్రబాస్‌కి మంచి హిట్స్ అందించడంతో పాటూ.. ప్రేక్షకుల మనసుకు బాగా దగ్గరైన సినిమాలు కూడా.
ఈ తరహాలోనే మారుతి సినిమా వుంటుందంటే.. అది కూడా లక్కు కలిసొచ్చి.. హిట్టయ్యిందంటే.. అటు ప్రబాస్‌కీ, ఇటు మారుతికీ ఇద్దరికీ పండగే. ఫ్యాన్స్‌కి ఇంకా పెద్ద పండగ.!
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







