పరగడుపున బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?
- February 05, 2024
బొప్పాయిలోని ఆరోగ్య గుణాలు అన్నీ ఇన్నీ కావు. తెల్లరక్త కణాలను పెంచడం, ఆరోగ్యంగా వుంచడంలో బొప్పాయి చాలా తోడ్పడుతుంది.
అయితే, బొప్పాయి పండును ఎప్పుడు తిన్నా ఆరోగ్యానికి మంచిదే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తింటే ఇంకా మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పరగడుపున బొప్పాయి పండు తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయిలోని ఎంజైమ్స్ ఆరోగ్యానికి అత్యంత మేలు చేయడమే కాకుండా.. ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తినడం వల్ల.. చెడు కొలెస్ట్రాల్ దరి చేరకుండా వుంటుంది.
అంతేకాదు, కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. దాంతో, ఊబకాయం వున్న వారు పరగడుపున బొప్పాయి పండు తింటే బరువు తగ్గే అవకాశాలు చాలా చాలా ఎక్కువ.
అంతేకాదు, జీర్ణ క్రియలో ఎటువంటి సమస్యలున్నా.. పరగడుపున బొప్పాయి పండు తినడం వల్ల క్యూర్ అయిపోతాయట. రోగ నిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణ క్రియ సక్రమంగా వుండడం వల్ల మలబద్ధకం సమస్య తీరుతుంది. ఈ సమస్య వున్నవారు ఖచ్చితంగా బొప్పాయి పండు తింటే ఫలితం వుంటుందని నిపుణులు నిక్కర్చిగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







