మహేష్ తన ఫ్యామిలీతో లండన్‌లో బిజీ..

- June 01, 2016 , by Maagulf
మహేష్ తన ఫ్యామిలీతో లండన్‌లో బిజీ..

'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ తో మహేష్ చాలా షాక్ అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆవార్తలను తలక్రిందులు చేస్తూ మహేష్ తన ఫ్యామిలీతో లండన్‌లో బిజీగా ఉంటూ వివిధ ప్రాంతాలను చుట్టేస్తున్నాడు. మహేష్ లండన్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారంమేరకు మహేష్ తన కుటుంబంతో జూన్ 15వరకు లండన్ లో ఉంటాడని టాక్. 'వన్' మూవీ షూటింగ్ టైమ్‌లో కొన్ని లొకేషన్స్ తో మహేష్ కు బాగా పరిచయం ఉండటంతో ఇప్పుడు ఆలోకేషన్స్ లో మహేష్ తన పిల్లలతో హడావిడి చేస్తున్నాడు.ఈ లండన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక మహేష్ ఈనెల 20వ తారీఖు నుండి మురగదాస్ మూవీ ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొంటాడు అని టాక్.ఈ వార్తలు ఇలా ఉండగా మహేష్ కు 'ఒక్కడు' 'పోకిరి' 'దూకుడు' 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులతో పాటు 'సైనికుడు' 'ఖలేజా' 'ఆగడు' '1 నేనొక్కడినే' 'బ్రహ్మోత్సవం' వంటి సూపర్ ఫ్లాప్ ల సంఖ్య కూడ మహేష్ కెరియర్ కు సంబంధించి పెరిగి పోతూ ఉండటంతో మహేష్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ కన్నా సూపర్ ఫ్లాప్ సినిమాల సంఖ్య పెరిగి పోతోంది అంటూ మరో ప్రచారానికి తెర తీసారు మహేష్ విమర్శకులు.అందుకే కాబోలు మురగదాస్ మూవీ ప్రాజెక్ట్ బడ్జెట్ విషయంలోనే కాకుండా ఆ సినిమా కథ విషయంలో కూడ మహేష్ చాల వ్యహత్మకంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. టాప్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో ఒక్క సూపర్ ఫెయిల్యూర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ ఈక్వేషన్స్ ను మార్చే స్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com