రేపటి నుంచి అందుబాటులోకి 'భారత్ రైస్'..
- February 06, 2024
న్యూ ఢిల్లీ: భారత్ రైస్ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ఫిక్స్ అయ్యింది. రేపు ( ఫిబ్రవరి 6న) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు.
తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతారు. ఆ తర్వాత 5, 10 కేజీల బ్యాగుల్లో విక్రయించనున్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రతి వస్తువు ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు కొని కడుపునిండా కమ్మగా తినలేని పరిస్థితి. ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ఇలా వేటి ధరలు చూసినా భగ్గుమంటున్నాయి. ఇక బియ్యం ధరలైతే చెప్పక్కర్లేదు. సాధారణ బియ్యమే రూ.40 పెట్టనిది రావడం లేదు. బియ్యం ధరలకు రెక్కలు రావడంతో కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం తాజాగా అతి తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా 'భారత్ రైస్' అనే బ్రాండ్‌ను తీసుకొస్తుంది. ఈ బియ్యం రూ.29కే కిలో అందించేందుకు సిద్ధమైంది.
భారత్ గోదుమపిండిని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 06, 2023న ప్రారంభించింది. దేశంలో సగటు గోదుమపిండి ధర రూ.35 ఉండగా.. భారత్ గోదుమపిండి ధర రూ.27.50 కే లభిస్తుంది. శనగ పప్పు కిలో రూ.60కి లభిస్తుంది. భారత్ రైస్ కి సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







