దుబాయ్‌లో 20 నిమిషాల్లో 50 ప్రమాదాలు
- February 06, 2024
యూఏఈ: దుబాయ్‌లో సోమవారం ఉదయం 20 నిమిషాల వ్యవధిలో 50 రోడ్డు ప్రమాదాలు నమోదైనట్లు దుబాయ్ పోలీస్ అధికారిక యాప్ వెల్లడించింది.దీంతో నగరంలో కీలకమైన ఆర్టీరియల్ రోడ్లపై తీవ్ర రద్దీ నెలకొంది. దుబాయ్ పోలీసులు ప్రమాదాల గురించి వాహనదారులను అప్రమత్తం చేశారు. మొదటిది హెస్సా స్ట్రీట్‌లో సౌదీ జర్మన్ హాస్పిటల్ ఎదురుగా షేక్ జాయెద్ రోడ్‌పై జరిగింది. కీలక మార్గంలో ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇంటర్నేషనల్ సిటీకి ఎదురుగా ఉన్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్‌లో జరిగిన రెండో ప్రమాదం కారణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ప్రమాద వీడియోలను పోలీసులు తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. మరోవైపు రోడ్డు ప్రమాదాలను అధిగమించేందుకు కొత్త కృత్రిమ మేధతో నడిచే వ్యవస్థను ప్రారంభించేందుకు దుబాయ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దీని కారణంగా దాదాపు 50% మాన్యువల్ ప్రక్రియలను తగ్గుతాయి. రోడ్డు ప్రమాదాలను నివేదించడానికి డ్రైవర్లకు సిస్టమ్ సులభమైన మార్గాన్ని అందిస్తుంది. ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, వారు దుబాయ్ పోలీస్ యాప్‌లో ఫోటోలతో పాటు డేటాను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.
2023 మొదటి ఎనిమిది నెలల్లో 35 వేల కంటే ఎక్కువ మంది డ్రైవర్లు తమ మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తూ పట్టుబట్టారు. ఈ ప్రమాదకరమైన పద్ధతి కారణంగా 99 ప్రమాదాలకు దారితీసింది. ఫలితంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మరణించగా.. 58 మంది గాయపడ్డారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. రోడ్డుపై ఫోన్‌లు వాడుతున్న డ్రైవర్లపై 800 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయని వెల్లడించారు. 2023లో రన్ ఓవర్ ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 339 మంది గాయపడ్డారని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







