పి.వాసు వారసుడు 'శివలింగ' చిత్రం లో...

- June 01, 2016 , by Maagulf
పి.వాసు వారసుడు 'శివలింగ' చిత్రం లో...

సీనియర్‌ దర్శకుడు పి.వాసు వారసుడు శక్తి 'చిన్నతంబి' చిత్రంతో బాలనటుడిగా ఇండస్ర్టీకి పరిచయమయ్యాడు. అనేక చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన అనంతరం పి.వాసు తెరకెక్కించిన 'తొట్టాల్‌ పూ మలరుమ్‌' చిత్రం ద్వారా శక్తిని హీరోగా ఆరంగేట్రం చేశాడు. అయితే హీరోగా శక్తి కెరీర్‌ ఆశించినట్టుగా సాగలేదు. కొంతకాలం నటనకు దూరంగా వున్నాడు కూడా. ఈ మధ్యే శక్తివేల్‌ వాసుగా పేరు మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు శక్తి. కన్నడంలో ఘన విజయం సాధించిన 'శివలింగ' చిత్రాన్ని తమిళంలో లారెన్స్ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో రెండో హీరోగా శక్తి నటించనున్నాడు.తన వారసుడ్ని నటుడిగా నిలబెట్టాలన్న లక్ష్యంతోనే ఈ పాత్రకు శక్తిని తీసుకున్నట్లు సమాచారం. కాగా, శక్తి ప్రస్తుతం '7నాట్కల్‌', 'దుర్యోదన' చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com