ఏపీ మంత్రివర్గం నిర్ణయం
- June 01, 2016
ఈ నెల 8న ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మహా సంకల్పం బహిరంగ సభను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రోజు ఉదయం విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్రంలో పల్స్ సర్వేకు ఆమోదం తెలిపారు. గురువారం నిర్వహించే నవ నిర్మాణ దీక్షలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. జూన్ 27 నాటికి ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశించారు. అమరావతికి వచ్చే ఉద్యోగులకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సీఆర్డీయే తీసుకోవాలని చంద్రబాబు స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







