‘లాల్ సలాం’ పై అంచనాలు పెరిగిపోయాయ్ సుమా.!
- February 07, 2024
రజనీకాంత్ గెస్ట్ రోల్ పోషిస్తున్న సినిమా ‘లాల్ సలాం’. రజనీకాంత్‌తో పాటూ ఈ సినిమాలో సీనియర్ నటి జీవిత.. మరో సీనియర్ నటి నిరోషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజనీకాంత్ గెస్ట్ రోల్ అయినప్పటికీ చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాలో. రజనీకాంత్ సినిమాలకు సౌత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బోలెడంత క్రేజ్ వున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అలాగే, ‘లాల్ సలాం’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ అయినప్పటికీ అంచనాలు బాగా వున్నాయ్. రజనీకాంత్ ముద్దుల తనయ ఐశ్వర్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆసక్తికరమైన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఓ అతిధి పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేయనున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ సినిమాకి అనేక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ వుండడంతో అంచనాలు బాగున్నాయ్.
తెలుగులో ఈ సినిమా ‘ఈగల్’కి పోటీకి రిలీజ్ అవుతోంది. చూడాలి మరి, ఈ సర్ప్రైజింగ్ మూవీని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారా.? లేక మాస్ రాజా ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడతారా.?
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







