‘కథా కేళి’ షూటింగ్ పూర్తి
- February 07, 2024
హైదరాబాద్: సతీశ్ వేగేశ్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఆయన ‘కథా కేళి’ చిత్రంతో తన కొడుకు యశ్విన్‌ను హీరోగా లాంచ్ చేయబోతోన్నారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ టీజర్‌ను దిల్ రాజు చేయగా.. అది ఎంతగానో వైరల్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
సతీశ్ వేగేశ్న ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. చిత్రయూనిట్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ఇక చివరి రోజున ఇలా చిత్రయూనిట్ అంతా కూడా సందడిగా కనిపించారు. ఈ మేరకు మేకర్స్ షేర్ చేసిన ఫోటోల్లో చిత్రయూనిట్ అంతా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. దాము నర్రావుల కెమెరామెన్‌గా, మధు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను ప్రకటించనున్నారు.
నటీనటులు:
యశ్విన్, దినేశ్ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితా పొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: శతమానం భవతి ఆర్ట్స్
సమర్పణ: చింతా గోపాల కృష్ణా రెడ్డి
రచన, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వేగేశ్న ప్రదీప్ రాజు
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.కె.బాలచంద్రన్
సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల
ఎడిటర్: మధు
ఆర్ట్: రామాంజనేయులు
లిరిసిస్ట్: శ్రీమణి
చీఫ్ కో డైరెక్టర్ : నరేంద్ర వర్మ మంతెన
పి.ఆర్.ఓ: వంశీ కాకా
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







