ముంబై తీరానికి సమీపంలో కువైట్ బోట్.. పోలీసుల దర్యాప్తు
- February 08, 2024
ముంబై: ముంబై తీర ప్రాంతంలో మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఫిషింగ్ బోటు కనిపించడంతో ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న "అబ్దుల్లా షరీఫ్" అనే బోటు దొరికింది. పడవలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారందరూ తమిళనాడులోని కన్యాకుమారికి చెందినవారని, వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు నిందితుల నుంచి అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని పేర్కొన్నారు. "పడవ కువైట్ నుండి వచ్చింది. స్వాధీనం చేసుకున్నాము. ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. కోలాబా పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు." అని అధికారులు తెలిపారు. బోటులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తాము కన్యాకుమారి నుండి వచ్చామని , కువైట్‌లోని ఒక కంపెనీలో పని చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు రెండేళ్లుగా తమకు జీతాలు ఇవ్వడం, ఆహారం ఇవ్వకపోవడంతో పారిపోవాలని నిర్ణయించుకున్నామని, తమ పాస్‌పోర్టులను యజమానులు స్వాధీనం చేసుకున్నారని, GPS సహాయంతో నావిగేట్ చేసుకుంటూ ముంబై చేరుకోవడానికి పది రోజులు పట్టిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







