ప్రధాని మోడీ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
- February 08, 2024
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ ప్రధాని నరేంద్ర మోడీ కులంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఒడిషాలోని ఝార్సుగుడలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఓబీసీ క్యాటగిరీలో జన్మించలేదని, గుజరాత్‌లోని తేలి కులంలో ఆయన జన్మించారని చెప్పారు. 2000 సంవత్సరంలో ఆ కులాన్ని బిజెపి ఓబీసీ క్యాటగిరీలో చేర్చిందని అన్నారు. మోడీ సాధారణ కులంలోనే జన్మించారని, స్వతహాగా ఓబీసీ కాదని రాహుల్ ఆరోపించారు. మోడీ ఓబీసీగా జన్మించనందునే ఆయన తన జీవితాంతం కులగణన నిర్వహించేందుకు అనుమతించరని అన్నారు.
ఇక రాహుల్ యాత్ర గురువారం ఒడిషా నుంచి చత్తీస్‌ఘఢ్‌లోకి ప్రవేశించనుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ ఓటమి పాలైన అనంతరం రాహుల్ తొలిసారిగా ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక రాహుల్ యాత్ర రాయ్ఘఢ్, కోర్బా జిల్లాల మీదుగా సాగుతూ ఫిబ్రవరి 14న బల్రాంపూర్ నుంచి జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







