పెట్రోల్ స్టేషన్‌లలోనూ ఫిర్యాదు..‘ ఆన్-ది-గో’తో సత్వర న్యాయం
- February 08, 2024
దుబాయ్: అనుమానాస్పద కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాలు, చట్టాల ఉల్లంఘనలను ఇకపై మీ సమీపంలోని పెట్రోల్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. నివాసితులు, పర్యాటకులు అధికారుల నుండి సత్వర సహాయం కోసం ఇప్పుడు పోలీసు స్టేషన్ వరకు వెళ్లవలసిన అవసరం లేదని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. దుబాయ్ పోలీసులు ఇటీవలే పెట్రోల్ కంపెనీలు ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఇనోక్), అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC), ఎమారాట్‌లతో కలిసి ఆన్-ది-గో అనే కొత్త సేవను అందించారు. ఈ వినూత్న సేవ వ్యక్తులు ఉల్లంఘనలను నివేదించడానికి, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో దోహదపడేందుకు మేలు చేస్తుందని దుబాయ్ పోలీసులు తెలిపారు. మొదటి లెఫ్టినెంట్ మజిద్ బిన్ సయీద్ అల్ కాబీ మాట్లాడుతూ.. "ఆన్-ది-గో" ద్వారా ఇంధనం నింపే స్టేషన్లలో పోలీసు సేవలను అందించడం ప్రపంచంలోనే మొదటి తరహదని అన్నారు. దుబాయ్‌లోని 138 పెట్రోల్ స్టేషన్లలో ఈ సేవలు అందించబడుతున్నాయని, కస్టమర్లకు సహాయం చేయడానికి శిక్షణ పొందిన 11 సంస్థల నుండి మొత్తం 4,867 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







