‘ఊరు పేరు భైరవకోన’’.! సందీప్ కిషన్ కష్టం వృధా కాకూడదు.!
- February 08, 2024
‘ఊరు పేరు భైరవకోన’.. ఈ నెల 9న రిలీజ్ కావల్సిన సినిమా ఇది. అయితే, మాస్ రాజా రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా కోసం ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు.
అయితేనేం.! ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి టైమ్ దొరికింది సందీప్ కిషన్‌కి. మరో వారం రోజుల్లో అనగా ఫిబ్రవరి 16న ‘ఊరు పేరు భైరవకోన’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. బొమ్మ హిట్టే అనిపిస్తోంది. అయితే, ఈ మధ్య టీజర్లు, ట్రైలర్లతో చాలా ఛీటింగ్ జరుగుతోంది. ట్రైలర్ ఇచ్చిన కిక్కు.. రిలీజ్ తర్వాత సినిమాలు ఇవ్వడం లేదు.
ఇటీవల రిలీజైన ‘సైంధవ్’ తదితర సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలు అలాగే వున్నాయ్. కానీ, ‘భైరవకోన’ సూపర్ నేచురల్ పవర్స్‌తో తెరకెక్కిన మూవీలా అనిపిస్తోంది.
‘విరూపాక్ష’ ఛాయలు కనిపిస్తున్నాయ్. ఒకవేళ లక్కు కలిసొచ్చి.. ఈ సినిమా హిట్ అయితే, సందీప్ కిషన్ కెరీర్‌కి యూజ్ అవుతుంది. అందుకే సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలతో సినిమాని జనాల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం బాగానే చేస్తున్నాడు. చూడాలి మరి, సందీప్ కిషన్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో.!
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









