కొబ్బరి నీళ్లలో సబ్జా గింజలు కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా.?

- February 08, 2024 , by Maagulf
కొబ్బరి నీళ్లలో సబ్జా గింజలు కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా.?

సీజన్ ఛేంజ్ అవుతున్న టైమ్‌లో మన శరీరం అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటుంది. ముఖ్యంగా శీతలం నుంచి వేసవికి మారే సమయంలో డీ హైడ్రేషన్ సమస్య వెంటాడుతుంది.

ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే.. ఈ చిన్న చిట్కా.!

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయ్. ముఖ్యంగా వేసవిలో కొబ్బరి నీళ్లను సంజీవనిగానే పోల్చి చూస్తారు. ఇందులోని పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉష్ణ తాపం నుంచి శరీరానికి రక్షణగా వుంటాయ్.

అలాగే, శరీరంలోని ఉష్గోగ్రతల్ని తటస్థీకరించడంలోనూ కొబ్బరి నీళ్లు సహకరిస్తాయ్. అయితే, కొబ్బరినీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలు కలిపి తీసుకుంటే.. ఇంకా మంచి ఫలితం వుంటుంది.

సబ్జా గింజలు నేచురల్ కూలెంట్‌గా పని చేస్తాయ్. అంతేకాదు, ఫైబర్ కంటెంట్ కూడా వీటిలో చాలా ఎక్కువ. అందుకే మలబద్ధకం సమస్య కూడా తీరుతుంది. అంతేకాదు, ఈ కాంబినేషన్ డ్రింక్ తాగడం వల్ల ఇది డీటాక్సిఫికేషన్‌గా పని చేస్తుంది. శరీరంలోని మలినాల్ని బయటికి పంపించేస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com