మాదకద్రవ్యాల వ్యతిరేకతకు బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్
- June 01, 2016
కేరళ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, మద్య పానానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ అంగీకరించారు. బుధవారం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను సచిన్, చిరంజీవి, నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సచిన్‌ను కోరారు. ఆయన దీనికి అంగీకరించారు. ప్రచారానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తానని సచిన్ హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఉండాలని విజయన్ కోరారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మాట్లాడి వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర యువకులు క్రీడా సాధన చేసేందుకు ఫుట్‌బాల్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా కేరళ బ్లాస్టర్స్ ముఖ్యమంత్రిని కోరింది. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సాకర్ క్రీడాకారులను తయారు చేసి వారికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశమని సచిన్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున, ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఈపీ జయరాజన్, ఆర్థిక మంత్రి టీఎం థామస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







