పార్ట్ నర్లు గా మారిన సెలబ్రిటీలు
- June 01, 2016
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తెలుగు సినీ దిగ్గజాలు చిరంజీవి, నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు వ్యాపార భాగస్వాములయ్యారు. కేరళ బ్లాస్టర్స్ పేరుతో ఫుట్ బాల్ జట్టును కొనుగోలు చేశారు. గతంలో చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ భాగస్వాములుగా ఉన్నారు. వీరు ఓ తెలుగు టీవీ చానెల్ ను నిర్వహించారు. ఇప్పుడు తెలుగు సినీ ప్రముఖులతో సచిన్ వ్యాపార భాగస్వామి అయ్యాడు.సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులతో పాటు చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే.
బుధవారం ఉదయం వారు శ్రీవారిని సందర్శించుకున్నారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







