తమిళనాడులో కుప్పకూలిన భవనం.. ఆరుగురు మహిళా కార్మికులు మృతి
- February 08, 2024
తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళా కార్మికులు మరణించారు.
ఊటీకి సమీపంలోని లవ్‌డేల్ ప్రాంతంలో ఓ పాత భవనాన్ని పునరుద్దరించే పనులను చేపట్టారు. దాదాపు 13 మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారు మట్టి పని చేస్తుండగా భవనంలోని కొంత భాగం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు. కార్మికుల అరుపులు విన్నచుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. నలుగురు కార్మికులను రక్షించారు. వీరికి గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మృతులను సంగీత (35), షకీల (30), భాగ్య (36), ఉమ (35), ముత్తులక్ష్మి (36), రాధ (38)గా గుర్తించారు. మృతులంతా ఉతగై గాంధీనగర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.
కాగా.. మరో కార్మికుడు గల్లంతైనట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







