CBSE బోర్డు పరీక్షలు:విద్యార్థులకు ప్రిన్సిపాల్స్ కీలక సూచనలు

- February 09, 2024 , by Maagulf
CBSE బోర్డు పరీక్షలు:విద్యార్థులకు ప్రిన్సిపాల్స్ కీలక సూచనలు

యూఏఈ: భారతీయ పాఠ్యాంశ పాఠశాలల్లోని విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు పరీక్షలు ప్రారంభం కావడానికి ఒక వారం కంటే తక్కువ సమయం ఉంది. 10 మరియు 12 తరగతులకు బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఈ సందర్భంగా  విద్యార్థులకు, వారి పేరెంట్స్ కు ప్రిన్సిపాల్స్ కీలక సూచనలు చేశారు.

క్రెడెన్స్ హైస్కూల్ CEO-ప్రిన్సిపాల్ దీపికా థాపర్ సింగ్ మాట్లాడుతూ.. “10 మరియు 12 తరగతుల విద్యార్థులకు ఇప్పుడు చాలా కీలకమైన కాలం. వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి మద్దతు అవసరం. వారు తమ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నించాలి.  గతంలో వచ్చిన ప్రశ్నలను సమీక్షించాలి. CBSE వెబ్‌సైట్‌లో అందించిన మోడల్ సమాధాన పత్రాలను రాయాలి.’’ అని వివరించారు. దుబాయ్‌లోని గల్ఫ్ ఇండియన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ముహమ్మద్ అలీ కొట్టక్కుళం మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, స్టడీ మెటీరియల్‌లను నిరంతరం సాధన చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, చివరి నిమిషంలో కొత్త అంశాలకు దూరంగా ఉండాలని, బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.  అదే సమయంలో విద్యార్థులు చదివే ప్రాంతాలలో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించడం ద్వారా తల్లిదండ్రులు అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. వారిపై ఒత్తిడి చేయకూడదని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com