కదిలే కారు పైకప్పులపై పిల్లలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరికలు

- February 10, 2024 , by Maagulf
కదిలే కారు పైకప్పులపై పిల్లలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరికలు

యూఏఈ: కదిలే కారు పైకప్పులపై కూర్చుని వెళ్ళే పిల్లలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. తలను బయట పెట్టడం లేదా కిటికీ నుండి చేతులను బయట పెట్టడం వంటివి ప్రమాదకరమైన పద్ధతులని తెలిపింది. ఇలా చేసిన వారికి జరిమానా, బ్లాక్ పాయింట్‌లు విధించడంతో పాటు వాహనాన్ని కొంత కాలం పాటు జప్తు చేయబడుతుందని హెచ్చరించారు. ఈ తరహా మొత్తం 1,183 ఉల్లంఘనలు నమోదు చేయబడ్డాయని, 707 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వాహనాల డ్రైవర్లకు 2,000 దిర్హామ్‌ల జరిమానా, 23 బ్లాక్‌ పాయింట్లు, వాహనాన్ని 60 రోజుల పాటు స్వాధీనం చేసుకోవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది. దీనికి తోడు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడుదల చేయడానికి యజమాని మరో Dh50,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com