నారా లోకేశ్ శంఖారావం యాత్ర.. ఇచ్చాపురంలో ప్రారంభం..

- February 11, 2024 , by Maagulf
నారా లోకేశ్ శంఖారావం యాత్ర.. ఇచ్చాపురంలో ప్రారంభం..

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టిసారించారు. ఇటీవల కాలంలో యువగళం పేరుతో సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించిన లోకేశ్.. జగన్ అరాచకాలపై శంఖారావం అంటూ మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. శంఖారావం పేరుతో చేపట్టిన యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. యువగళం పాదయాత్ర సాగని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా నారా లోకేశ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ శంఖారావం యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమవుతుంది. ప్రజా చైతన్య శంఖారావo ద్వారా.. నవ్యాంధ్రకి నవశకం లిఖించే ఈ సమర నినాదంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని లోకేష్ పిలుపు నిచ్చారు.

ప్రజా చైతన్య శంఖారావం యాత్ర.. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున తొలిదశలో 11రోజులపాటు 31 నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి లోకేశ్ శంఖారావం యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ఆ నియోజకవర్గంలో సభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం పలాస, సాయంత్రం టెక్కలిలో సభల్లో లోకేశ్ పాల్గొని ప్రసంగిస్తారు. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖాముఖీ అవుతారు. పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించి.. సూపర్ -6 కిట్లను అందజేస్తారు. సెల్ఫీవిత్ లోకేశ్ కార్యక్రమం ఉంటుంది.

బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబరిచిన కార్యకర్తలకు లోకేశ్ అభినందనలు తెలపనున్నారు. లోకేశ్ సమక్షంలో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరనున్నారు. రాత్రికి నరసన్నపేట పరిధిలోని జమ్ము గ్రామ శివారులో లోకేశ్ బస చేస్తారు. రేపు (సోమవారం) నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలసల్లో లోకేశ్ శంఖారావం సభలు నిర్వహిస్తారు. 13వ తేదీన పాతపట్నం నియోకవర్గం , ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకోండ (మన్యం జిల్లా ) నియోజకవర్గ కేంద్రాల్లో.. 15వ తేది, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం (విజయనగరం జిల్లా), శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చేర్ల నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం యాత్ర సాగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com