భయపెడుతున్న మమ్మట్టి 'భ్రమయుగం' తెలుగు ట్రైలర్‌

- February 11, 2024 , by Maagulf
భయపెడుతున్న మమ్మట్టి \'భ్రమయుగం\' తెలుగు ట్రైలర్‌

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం 'భ్రమయుగం'. రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్‌. శశికాంత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే రోజు ఖరారైంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

భిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్‌, భరతన్, అమల్దా లిజ్‌ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ''హారర్‌-థ్రిల్లర్‌ జానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది'' అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా షెహనాద్‌ జలాల్ ఉంటే సంగీతం క్రిస్టో జేవియర్‌ అందించారు.

సౌత్‌ ఇండియాలో విభిన్నమైన నటుడిగా మమ్ముట్టికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఆయనకు గతంలో జాతీయ అవార్డు కూడా దక్కింది. యాత్ర, యాత్ర-2 చిత్రాలతో ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారని ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభినందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com