యూఏఈ లో భారత ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన షెడ్యూల్

- February 11, 2024 , by Maagulf
యూఏఈ లో భారత ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన షెడ్యూల్

యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి రెండు రోజులపాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమై అబుదాబిలో మధ్యప్రాచ్యంలోని తొలి సంప్రదాయ హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభిస్తారు. గత ఎనిమిది నెలల్లో ఆయన యూఏఈకి రావడం ఇది మూడోసారి. 2015 తర్వాత ఏడవది. ఈ పర్యటనలో మోదీ అబుదాబి మరియు దుబాయ్‌లలో సమావేశాలలో పాల్గొంటారు. యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తోనూ మోదీ భేటీ అవుతారు. మంగళవారం సాయంత్రం అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో 'అహ్లాన్ మోడీ' కార్యక్రమంలో 60,000 మందికి పైగా భారతీయ ప్రవాస సంఘం సభ్యులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.  బుధవారం, భారత ప్రధాని మొదటగా దుబాయ్‌లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో పాల్గొంటారు. భారత్, టర్కీ, ఖతార్ దేశాలు 'గౌరవ అతిథి'లుగా ఉన్న ఈ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేస్తారు. బుధవారం సాయంత్రం అబు మురీఖాలోని BAPS హిందూ మందిర్‌ను మోదీ ప్రారంభించనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com