సోమాలియాలో ఉగ్రవాదుల దాడి..ముగ్గురు యూఏఈ సైనికులు మృతి
- February 11, 2024
యూఏఈ: సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో యూఏఈ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు, ఒక బహ్రెయిన్ అధికారి మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో మరో ఇద్దరికి గాయాలైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య సైనిక సహకార ఒప్పందంలో భాగంగా సోమాలి సాయుధ దళాలకు శిక్షణ ఇస్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. సైనికుల కుటుంబాలకు రక్షణ మంత్రిత్వ శాఖ తన సంతాపాన్ని తెలియజేసింది. దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







