బహ్రెయిన్ అక్రమ శ్రామికులకు 6నెలల క్షమాభిక్ష కాలవ్యవధి
- June 29, 2015
ద లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ ఆధారిటీ (LMRA) వారు శనివారం, జూన్-27న అక్రమ శ్రామికులు బహ్రెయిన్ లో వారి ఉనికిని చట్టబద్ధం చేసుకునేందుకు లేదా విధమైన జరిమాన చెల్లించనవసరం లేకుండా, బ్లాక్ లిస్టులోకి చేరకుండా వారి స్వదేశాలకు తరలిపోయేందుకు వీలు కల్పిం చారు.జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు క్షమాభిక్షకు గడువు విధించింది.
ప్రకటించిన వివరాల ప్రకారం, వీరికి ఆరునెలలపాటు క్షమాభిక్ష కాలవ్యవధిని ప్రసాదించింది. ఈ కాలవ్యవధిలో బహ్రెయిన్ ను విడిచి వెళ్లినవారు మరల ఏ ఆటంకము లేకుండా ఇక్కడికి తిరిగి రావచ్చు. LMRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఔషామ అలాబ్సీ- అక్రమంగా నివాసముంటూ, దోపిడీకీ గురౌతున్న శ్రామికులకు ఏ విధమైన కష్టనష్టాలకు గురికాని కొత్త ప్రారంభాన్నివ్వాలనే ఉద్దేశంతో వారు ఉన్నట్టు తెలిపారు. ఇందుకు గాను నేష నాలిటీ, పాస్‌పోర్టు అండ్ రెసిడెన్స్ ఆఫైర్స్ హెడ్ క్వార్టర్స్‌లో మాత్రమే, ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎక్స్ టెన్షన్ పొందాలని ఆయన వివరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







