ఆహారపదార్థాలు వేడి చేయవొద్దు
- June 29, 2015
మనం మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి వేడి చేయటం వలన ఆహారం వృథా కాదు అన్నది నిజం. సాధారణంగా ఇలా చేయటం సరి అయినదే, అలా చేయటం కొన్ని ఆహా రాలపట్ల ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని ఆహార పదార్థాలను తిరిగి వేడి చేసినప్పుడు వాటిలో ఉన్న పోషకాలను కోల్పోతాయి మరియు మరికొన్ని మనకు పాయిజన్ గా మారిపోతాయి. కాబట్టి, మనము ఏ ఆహారంపట్ల తప్పుగా చేస్తున్నామో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరియు మన కుటుంబాల ఆరోగ్యం కొరకు ఆహారపదార్థాలను వేడి చేసుకుని తినటం నివారించటం అవసరం. ఏ ఆహారపదార్థాలను నివారించాలో చూడడానికి ఈ స్లయిడ్ షోని క్లిక్ చేయండి.బంగాళ దుంపలు మీకు చాలా మంచివి; వాటిలో చాలా అధిక పోషక విలువలు ఉన్నాయి. కానీ మీరు ఎక్కువకాలం వాటిని ఫ్రిజ్ లో ఉంచితే, వాటి పోషక విలువలు మరింతగా కోల్పోయే అవకాశం ఉన్నది. వాటిని వేడిచేయటం వలన అవి విషపూరితం కావొచ్చు. ఈ రోజుల్లో చికెన్ సర్వసాధారణంగా తిరిగి వేడిచేసుకుని తినే ఆహారాలలో ఒకటి. కానీ దానిని తిరిగి వేడి చేసుకుని తినటం అన్నది చాలా అనారోగ్యకరం ఎందువలనంటే దీనిలో ప్రోటీన్ పదార్థాలు అధికంగా ఉంటాయి మరియు అవి తిరిగి వేడి చేయటం వలన జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. మీరు నిజంగా తినాలి అనుకుంటే దానిని చల్లగానే తినండి. పుట్టగొడుగులను ఎల్లప్పుడూ తయారైన వెంటనే తింటారు. మీరు వండిన తరువాత చాలాసమయం వరకు ఉంచినట్లయితే, వీటిలోని ప్రోటీన్లు మార్పు చెంది జీర్ణం కావటానికి కష్టమవుతుంది. దుంపకూరలలో నైట్రేట్ అధిక స్థాయిలో ఉంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని తిరిగి వేడి చేసి తీసుకోకూడదు. పాలకూరను కూడా తిరిగి వేడి చేసి తినటం ప్రమాదకరం. స్పినాచ్ లో నైట్రేట్ అధిక స్థాయిలో ఉంటుంది, దీనిని తిరిగి వేడి చేసినప్పుడు పూర్తిగా నైట్రేట్ మారుతుంది. ఇది శరీరాన్ని కార్సినోజెనెటిక్ గా ఉంచుతుంది. అధిక వేడికి గురైనప్పుడు గుడ్లు విషపూరితం అవుతాయి. మీరు పగలకొట్టిన గుడ్లను తిరిగి వేడి చేసి తినవద్దు మరియు ఉడికించిన గుడ్లను కూడా తిరిగి వేడిచేసి తినవద్దు. వీటిని తిరిగి వేసిచేసి తినటం వలన మీ కడుపులో కలత మొదలవుతుంది. బచ్చలికూరలో కూడా అధికంగా నైట్రేట్ ఉండటం వలన, దీనిని తిరిగి వేడి చేయకూడదు. సాధారణంగా, ప్రజలు దీనిని సూప్ లో మరియు వేరే పదార్థాలలో వాడుతుంటారు, నేను సమస్యలను నివారించేందుకు ఈ ఆకుకూరను తొలగించి వేడి చేయటం మంచిది అని సలహా చెపుతాను.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







