చాక్లెట్ పెద్దోళ్ళ ఆరోగ్యానికీ మంచిదే
- June 29, 2015
చాక్లెటా? అది పిల్లలు తినేది. పెద్దవాళ్లం మనం ఏం తింటాం చిన్నపిల్లల్లా? అనేది ప్రతీ పెద్దవాళ్లూ అనే మాట. అయితే చాక్లెట్ చిన్న పిల్లలే కాదు. పెద్ద వాళ్లకి కూడా మంచిదేనని కొన్ని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అనేక రకాల ఒత్తిడుల నుండి, ఆందోళనల నుండి చాక్లెట్ ఎంతో రిలాక్స్‌నిస్తుందట. అంతేకాదు అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఒక చిన్న ముక్క బ్లాక్ చాక్లెట్ తింటే మంచిదంట. బ్లాక్ చాక్లెట్‌లో చెడుకొలెస్ట్రాల్‌ని తగ్గించే ఫ్లవనాయిడ్స్ ఉండడం వల్ల గుండెకు సంబంధించిన జబ్బులను దూరం చేసే అవకాశం ఉంది. అంతే కాదు రోజూ క్రమంగా ఒక చిన్న ముక్క చాక్లెట్ తినే వారికి ఊబకాయ సమస్య కూడా అదుపులో ఉంటుందట. అంతే కాదు ముఖ్యంగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడుకు రక్త సరఫరా బాగా జరిగి, జ్ఞాపక శక్తి తగ్గే పరిస్థితులే ఉండవట. అయితే ఇంకేం అందరం ఎంచక్కా కొద్ది పరిమాణంలో డార్క్ చాక్లెట్ తినొచ్చు. అతి సర్వత్ర వర్జయేత్. అలాగే ఆయా వ్యాధులతో బాధపడ్తున్నవారు డాక్టర్ సలహా మేరకే చాక్లెట్ జోలికి వెళ్ళాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







