ప్ర‌పంచ శాంతికి BAPS హిందూ మందిర్‌లో విశ్వ సంవాదిత యజ్ఞం

- February 12, 2024 , by Maagulf
ప్ర‌పంచ శాంతికి BAPS హిందూ మందిర్‌లో విశ్వ సంవాదిత యజ్ఞం

అబుధాబి: ఫిబ్రవరి 11న అబుదాబిలోని BAPS హిందూ మందిర్‌లో విశ్వ సంవాదిత యజ్ఞం (ప్రపంచ సామరస్యం కోసం వేద ప్రార్థనలు) నిర్వ‌హించారు.ఈ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల‌ను ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ పేరిట  అబుదాబిలో BAPS హిందూ మందిర్ చారిత్రాత్మక ప్రారంభోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు శాంతి, సామరస్యం మరియు శ్రేయస్సు, విజయం సాధించాల‌ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న‌ లండన్ కు చెందిన‌ 70 ఏళ్ల భక్తురాలు జయశ్రీ ఇనామ్‌దార్ మాట్లాడుతూ.. వర్షాలు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మరింత చిరస్మరణీయంగా..  ఆనందదాయకంగా మార్చాయ‌న్నారు. వర్షంలో యజ్ఞం జరగడం త‌న‌ జీవితంలో ఎప్పుడూ చూడలేద‌న్నారు. ఇది  శుభపరిణామంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com