అబుదాబి చేరుకున్న భారత ప్రధాని మోదీ

- February 13, 2024 , by Maagulf
అబుదాబి చేరుకున్న భారత ప్రధాని మోదీ

యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మంగళవారం అబుదాబి చేరుకున్నారు. భారత ప్రధాని యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అయిన కసర్ అల్ వతన్ వద్ద ఆయనకు లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.  అనంతరం ఇరు నేతలు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు "భారత్-యూఏఈ మధ్య బలమైన స్నేహానికి మేము ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తూ.. అధికారం చేపట్టిన తర్వాత నా యూఏఈ పర్యటన ఏడవది" అని మోడీ అబుదాబికి బయలుదేరే ముందు ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా మే 1, 2022 నుండి అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) తర్వాత భారతదేశం-యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధం బలోపేతం అయింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $85 బిలియన్లుగా ఉంది.మరోవైపు అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో 'అహ్లాన్ మోడీ' కార్యక్రమంలో మోడీ వేలాది మంది భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించనున్నరు . కాగా,బుధవారం భారత ప్రధాని దుబాయ్‌లో జరిగే ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2024లో పాల్గొంటారు. టర్కీ, ఖతార్‌లతో పాటు భారతదేశం 'గౌరవ అతిథి' దేశంగా ఉన్న ఈ సదస్సులో మోడీ కీలక ప్రసంగం చేస్తారు. అలాగే సాయంత్రం అబుదాబిలో మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి సాంప్రదాయ హిందూ ఇసుకరాయి దేవాలయమైన BAPS హిందూ మందిర్‌ను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని ఖతార్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com