దుబాయ్‌లో 30 శాతం పెరిగిన పూల ధరలు

- February 13, 2024 , by Maagulf
దుబాయ్‌లో 30 శాతం పెరిగిన పూల ధరలు

దుబాయ్: ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేని పురస్కరించుకొని దుబాయ్‌లో ఈ నెలలో పూల ధరలు 30 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 7న రోజ్ డే, ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9న చాక్లెట్ డే, ఫిబ్రవరి 10న టెడ్డీ డే, ఫిబ్రవరి 11న ప్రామిస్ డే, ఫిబ్రవరి 12న ఎంబ్రేస్ డే, ఫిబ్రవరి 13న కిస్ డేగా నిర్వహిస్తారు. కెన్యా, ఈక్వెడార్, ఇథియోపియా, నెదర్లాండ్స్ మరియు కొలంబియా వంటి దేశాల నుండి సాధారణంగా పువ్వులు దుబాయ్‌కి దిగుమతి అవుతాయి. 150 మిలియన్లకు పైగా పూలు మరియు 250 మిలియన్ల మొక్కలతో కూడిన ఐకానిక్ మిరాకిల్ గార్డెన్ 2013లో ప్రేమికుల రోజున ప్రారంభించిన విషయం తెలిసిందే.Buyanyflowers.comలో సహ వ్యవస్థాపకుడు & మార్కెటింగ్ & ఫైనాన్స్ హెడ్ అమరేంద్ర ప్రతాప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కస్టమర్లు క్లాసిక్ రెడ్ రోజ్, మ్యాజిక్ అవలాంచ్ రోజ్, డీప్ పర్పుల్ రోజ్ వంటి విభిన్న రంగులు మరియు రకరకాల పువ్వుల కోసం ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారని,  వైట్ లిల్లీలు, తులిప్స్, ఆర్కిడ్లు మరియు కార్నేషన్లు కూడా బాగానే సేల్ అవుతాయన్నారు.  వాలెంటైన్స్ డే సందర్భంగా యూఏఈలో పువ్వుల ధరలు పెరగడం సాధారణ విషయం అన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com