బెలూన్‌లు, వాటర్ గన్‌ అమ్మకాలను నిషేధం

- February 13, 2024 , by Maagulf
బెలూన్‌లు, వాటర్ గన్‌ అమ్మకాలను నిషేధం

కువైట్: అన్ని వాణిజ్య కేంద్రాలలో “బెలూన్‌లు” మరియు “వాటర్ గన్‌ల” అమ్మకాలను నిషేధించాలని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.  జాతీయ దినోత్సవ వేడుకల్లో వాటర్ బెలూన్లు, వాటర్ పిస్టల్స్ వాడకాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఈ నిషేధం ఫిబ్రవరి నెలకు మాత్రమే పరిమితం అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 25, 26 మధ్య కాలంలో నీటి వృధాపై విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా వాటర్ బెలూన్‌ల కారణంగా పెద్ద సంఖ్యలో ముఖం, కంటికి గాయాలు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికలు సూచిస్తున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com