షేక్ జాయెద్ రోడ్డులో నిలిచిన వరద..!
- February 13, 2024
దుబాయ్: ఫిబ్రవరి 12 సాయంత్రం మరియు రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా దుబాయ్‌లో వరద పోటెత్తింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అనేక కీలక రహదారుల్లో వాహనాలను మళ్లించారు. జెబెల్ అలీ ప్రాంతంలోని షేక్ జాయెద్ రోడ్డుపై కూడా వరద నీరు నిల్వడంతో ట్రాఫిక్ ను మళ్లించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని రోడ్డు మరియు రవాణా అథారిటీ (RTA) కోరింది. అబుదాబి వైపు వెళ్లే వారి కోసం షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్.. అబుదాబి నుండి వచ్చే వారి కోసం షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్ వైపు సీహ్ షుయబ్ స్ట్రీట్ ద్వారా వెళ్లాలని సూచించింది. ఇదిలా ఉండగా సోమవారం అర్ధరాత్రి దుబాయ్ నుండి అబుదాబికి తిరిగి వెళ్తున్న నివాసితులు షేక్ జాయెద్ రోడ్‌లో వరద నిలవడంతో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. వాహనదారులకు సహాయం చేసేందుకు అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. మరోవైపు దేశంలో వర్షాలు కురుస్తున్నందున ఫిబ్రవరి 13న ఫ్లెక్సిబుల్ వర్క్‌ను కొనసాగించాలని యూఏఈలోని ప్రైవేట్ రంగ కంపెనీలు నిర్ణయించాయి.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







