మైత్రీ మూవీస్ ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
- February 15, 2024
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ సంస్థ ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఆ సినిమా పేరు ‘8 వసంతాలు’. బ్యూటిఫుల్ పోస్టర్‌తో అనౌన్స్ చేసిన ఈ సినిమాకి అంతకన్నా బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చారు. క్యాప్షన్‌ని బట్టి ఇదో రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది.
ఎనిమిది సంవత్సరాల కాలంలో జరిగే ఓ కథ.. ఓ అందమైన యువతి తన జీవితంలోని అనేక ఒడిదుడుకుల్ని, ఎదుర్కొన్న అనుభవాల్నీ ఓ అందమైన జర్నీగా ఈ సినిమాలో చూపించబోతున్నారట.
‘365 రోజుల్ని అంకెలతో కొలిస్తే సంవత్సరం.. అదే అనుభవాలతో కొలిస్తే అదే వసంతం..’ అని పోస్టర్‌పై రాసుంది. అంటే, ఎనిమిది సంవత్సరాల అనుభవాల్ని బ్యూటిఫుల్‌గా తెరపై ఆవిష్కరించబోతున్నట్లు మైత్రీ సంస్థ ఈ పోస్టర్ ద్వారా ఇన్నోవేటివ్‌గా తెలిపిందన్న మాట.
ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామాని ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నారు. మరి, ఈ సినిమాలో నటించబోయే ఆ అందమైన యువతి ఎవరో తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







