‘మిస్టర్ బచ్చన్’.! మాస్ రాజా ఎంత ఘాటు ప్రేమయో.!
- February 15, 2024
మాస్ రాజా రవితేజ లెటెస్ట్‌గా ‘ఈగల్’ సినిమాతో సందడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వెంటనే మరో సినిమా అప్డేట్ కూడా ఇచ్చేశారు. ఆల్రెడీ మాస్ రాజా, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా షూటింగ్‌లో వుందన్న సంగతి కూడా తెలిసిందే.
శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా వాలైంటైన్ డే స్పెషల్‌గా మాస్ రాజా అభిమానులకు ఓ గాఢమైన రొమాంటిక్ గిప్ట్ వదిలాడు. అదే తన తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్’ నుంచి ఓ రొమాంటిక్ పోస్టర్.
రొమాంటిక్ అంటే.. అలాంటిలాంటి రొమాన్స్ కాదు మరి. ‘ఎంత ఘాటు ప్రేమయో’ అనాల్సిందే ఆ పోస్టర్ చూసి. కుర్చీలో కూర్చున్న మాస్ రాజా ఒళ్లో తన ప్రేయసిని ఘాటుగా స్టైలిష్ పోజులో కౌగిలించుకున్న చిత్రమది.
ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ మాస్ రాజా ఘాటు ప్రేమ కౌగిలిలో ఒదిగిపోయిన ఆ ముద్దుగుమ్మ ఎవరంటారా.? ఆమె పేరు భాగ్యశ్రీ బోర్సే.. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. సహజంగానే హరీష్ శంకర్ సినిమాల్లో హీరోయిన్లు చాలా చాలా అందంగా వుంటారు. ఈ కొత్త భామను ఇంకెంత అందంగా చూపించి వుంటాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







